భయము చెందకు భక్తుడా

🔊 bhayamu chèMdaku bhaktuDA

📖 తెలుగు సాహిత్యం

భయము చెందకు భక్తుడా
ఈ మాయ లోక ఛాయలు చూచినప్పుడు (2)
భయము చెందకు నీవు
దిగులు చెందకు నీవు (2)
జీవమిచ్చిన యెహొవున్నాడు
ఓ భక్తుడా.. ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు           ||భయము||
బబులోను దేశమందున
ఆ భక్తులు ముగ్గురు.. బొమ్మకు మ్రొక్కనందునా (2)
పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే (2)
నాల్గవ వాడు ఉండలేదా
ఓ భక్తుడా.. నాల్గవ వాడు ఉండలేదా         ||భయము||
చెరసాలలో వేసినా
తన దేహమంతా.. గాయాలతో నిండినా (2)
పాడి కీర్తించి పౌలు సీలలు కొనియాడ (2)
భూకంపం కలుగ లేదా
ఆ భక్తులు ముగ్గురు.. చెరనుండి విడుదల కాలేదా           ||భయము||
ఆస్తి అంతా పోయినా
తన దేహమంతా.. కురుపులతో నిండినా (2)
అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయె (2)
అని యోబు పలుక లేదా
ఓ భక్తుడా.. అని యోబు పలుక లేదా         ||భయము||

📖 English Lyrics

Bhayamu Chendaku Bhakthudaa
Ee Maaya Loka Chaayalu Choochinappudu (2)
Bhayamu Chendaku Neevu
Digulu Chendaku Neevu (2)
Jeevamichchina Yehovunnaadu
O Bhakthudaa.. Praanam Pettina Yesayyunnaadu           ||Bhayamu||
Babulonu Deshamanduna
Aa Bhakthulu Mugguru.. Bommanku Mrokkanandunaa (2)
Patti Bandhinchi Raaju Agnilo Padavesthe (2)
Naalgava Vaadu Undaledaa
O Bhakthudaa.. Naalgava Vaadu Undaledaa           ||Bhayamu||
Cherasaalalo Vesinaa
Thana Dehamanthaa.. Gaayaalatho Nindinaa (2)
Paadi Keerthinchi Poulu Seelalu Koniyaada (2)
Bhookampam Kaluga Ledaa
Aa Bhakthulu Mugguru.. Cheranundi Vidudala Kaaledaa            ||Bhayamu||
Aasthi Anthaa Poyinaa
Thana Dehamanthaa.. Kurupulatho Nindinaa (2)
Anni Ichchina Thandri Anni Theesuku Poye (2)
Ani Yobu Paluka Ledaa
O Bhakthudaa.. Ani Yobu Paluka Ledaa         ||Bhayamu||

🙏 Share This Song

WhatsApp Facebook Telegram Twitter