జీవితాంతము వరకు నీకే
🔊 jIvitAMtamu varaku nIke
📖 తెలుగు సాహిత్యం
జీవితాంతము వరకు నీకే – సేవ సల్పుదునంటినినీవు నాతో నుండి ధైర్యము – నిచ్చి నడుపుము రక్షకా ||జీవితాంతము||
ఎన్ని యాటంకంబులున్నను – ఎన్ని భయములు కల్గిన అన్ని పోవును నీవు నాకడ – నున్న నిజమిది రక్షకా ||జీవితాంతము||
అన్ని వేళల నీవు చెంతనె – యున్న యను భవమీయవె తిన్నగా నీ మార్గమందున – పూనినడచెద రక్షకా ||జీవితాంతము||
నేత్రములు మిరుమిట్లు గొలిపెడి – చిత్రదృశ్యములున్నను శత్రువగు సాతాను గెల్వను – చాలు నీ కృప రక్షకా ||జీవితాంతము||
నాదు హృదయమునందు వెలుపట – నావరించిన శత్రులన్ చెదర గొట్టుము రూపుమాపుము – శ్రీఘ్రముగ నారక్షకా ||జీవితాంతము||
మహిమలో నీవుండు చోటికి – మమ్ము జేర్చెదనంటివే ఇహము దాటినదాక నిన్ను – వీడనంటిని రక్షకా ||జీవితాంతము||
పాప మార్గము దరికి బోవక – పాత యాశల గోరక ఎపుడు నిన్నే వెంబడింపగ – కృప నొసంగుము రక్షకా ||జీవితాంతము||
📖 English Lyrics
Enni Yaatankambulunnanu – Enni Bhayamulu KalginaAnni Povunu Neevu Naakada – Nunna Nijamidi Rakshakaa ||Jeevithaanthamu||
Anni Velala Neevu Chenthane – Yunna YanubhavameeyaveThinnagaa Nee Maargamanduna – Pooni Nadacheda Rakshakaa ||Jeevithaanthamu||
Nethramulu Mirumitlu Golipedi – Chithra DrushyamulunnanuShathruvagu Saathaanu Gelvanu – Chaalu Nee Krupa Rakshakaa ||Jeevithaanthamu||
Naadu Hrudayamunandu Velupata – Naavarinchina ShathrulanChedara Gottumu Roopumaapumu – Sheeghramuga Naa Rakshakaa ||Jeevithaanthamu||
Mahimalo Neevundu Chotiki – Mammu JerchedanantiveIhamu Daatina Daaka Ninnu – Veedanantini Rakshakaa ||Jeevithaanthamu||
Paapa Maargamu Dariki Bovaka – Paatha Yaashala GorakaEpudu Ninne Vembadimpaga – Krupa Nosangumu Rakshakaa ||Jeevithaanthamu||