మేము భయపడము

🔊 memu bhayapaDamu

📖 తెలుగు సాహిత్యం

మేము భయపడము – ఇక మేము భయపడము
ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు (2)      ||మేము||
దైవ భ్రష్టులమైన మమ్ము
దివ్యంపుగా రక్షించే (2)
దీవారాత్రులు దేవుడే కాయును      ||మేము||
శత్రు కోటి మమ్ము జుట్టన్
పాతాళము మ్రింగ జూడన్ (2)
నిత్యుడు యేసు నిత్యము కాయును      ||మేము||
అగ్ని పరీక్షల యందు
వాగ్ధానమిచ్చె మాతో నుండ (2)
ఏ ఘడియైనను విడువక కాయును      ||మేము||
బలమైన ప్రభు హస్తములు
వలయము వలె మమ్ము జుట్టి (2)
పలు విధములుగా కాపాడు మమ్ము      ||మేము||
కునుకడు మన దేవుడు
యెన్నడు నిద్రించడు (2)
కను పాపగా మము కాపాడునెప్పుడు      ||మేము||
జీవిత కష్ట నష్టములు
ఆవరించి దుఃఖపరచ (2)
దేవుడొసంగిన ఈవుల నెంచుచు      ||మేము||
ఇహమందు మన శ్రమలన్ని
మహిమకు మార్చెడు ప్రభున్ (2)
మహిమపరచి మ్రొక్కెదములలో      ||మేము||

📖 English Lyrics

Memu Bhayapadamu – Ika Memu Bhayapadamu
Ae Keedu Raadani Yese Cheppenu Maaku (2)     ||Memu||
Daiva Bhrashtulamaina Mammu
Divyampugaa Rakshinche (2)
Deevaaraathrulu Devude Kaayunu          ||Memu||
Shathru Koti Mammu Juttan
Paathaalamu Mringa Joodan (2)
Nithyudu Yesu Nithyamu Kaayunu         ||Memu||
Agni Pareekshala Yandu
Vaagdhaanamichche Maatho Nunda (2)
Ye Ghadiyainanu Viduvaka Kaayunu         ||Memu||
Balamaina Prabhu Hasthamulu
Valayamu Vale Mammu Jutti (2)
Palu Vidhamulugaa Kaapaadu Mammu         ||Memu||
Kunukadu Mana Devudu
Yennadu Nidrinchadu (2)
Kanu Paapaga Mamu Kaapaaduneppudu         ||Memu||
Jeevitha Kashta Nashtamulu
Aavarinchi Dukhaparacha (2)
Devudosangina Eevula Nenchuchu         ||Memu||
Ihamandu Mana Shramalanni
Mahimaku Maarchedu Prabhun (2)
Mahimaparachi Mrokkedamilalo         ||Memu||

🙏 Share This Song

WhatsApp Facebook Telegram Twitter