హల్లెలుయా పాడెదా

🔊 hallèluyA pADèdA

📖 తెలుగు సాహిత్యం

హల్లెలుయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్ (2)
అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును (2)
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్          ||హల్లెలుయా||
వాగ్ధానములనిచ్చి
నెరవేర్చువాడవు నీవే (2)
నమ్మకమైన దేవా
నన్ను కాపాడువాడవు నీవే (2)
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్         ||హల్లెలుయా||
ఎందరు నిను చూచిరో
వారికి వెలుగు కల్గెన్ (2)
ప్రభువా నీ వెలుగొందితిన్
నా జీవంపు జ్యోతివి నీవే (2)
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్         ||హల్లెలుయా||
కష్టములన్నింటిని
ప్రియముగా భరియింతును (2)
నీ కొరకే జీవింతును
నా జీవంపు దాతవు నీవే (2)
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్         ||హల్లెలుయా||

📖 English Lyrics

Hallelujah Paadedaa Prabhu Ninnu Koniyaadedan (2)
Anni Velalayandunaa Ninnu Poojinchi Keerthinthunu (2)
Prabhuvaa Ninnu Ne Koniyaadedan         ||Hallelujah||
Vaagdhaanamulanichchi
Neraverchuvaadavu Neeve (2)
Nammakamaina Devaa
Nannu Kaapaaduvaadavu Neeve (2)
Prabhuvaa Ninnu Ne Koniyaadedan          ||Hallelujah||
Endaru Ninu Choochiro
Vaariki Velugu Kalgen (2)
Prabhuvaa Nee Velugondithin
Naa Jeevampu Jyothivi Neeve (2)
Prabhuvaa Ninnu Ne Koniyaadedan              ||Hallelujah||
Kashtamulannintini
Priyamuga Bhariyinthunu (2)
Nee Korake Jeevinthunu
Naa Jeevampu Daathavu Neeve (2)
Prabhuvaa Ninnu Ne Koniyaadedan               ||Hallelujah||

🙏 Share This Song

WhatsApp Facebook Telegram Twitter