ఈ సాయంకాలమున

🔊 I sAyaMkAlamuna

📖 తెలుగు సాహిత్యం

ఈ సాయంకాలమున – యేసు ప్రభో వేడెదము
నీ సుదయారస మొల్క – నిత్యంబు మముగావు     ||ఈ సాయంకాలమున||
చెడ్డ కలల్ రాకుండ – నడ్డగించుమి ప్రభో
బిడ్డలము రాత్రిలో – భీతి బాపుము తండ్రీ     ||ఈ సాయంకాలమున||
దుష్టుండౌ శోధకుని – ద్రోక్కుటకు బలమిమ్ము
భ్రష్టత్వమున మేము – పడకుండ గాపాడు     ||ఈ సాయంకాలమున||
నీ యేక పుత్రుండౌ – శ్రీయేసు నామమున
సాయం ప్రార్థన లెల్ల – సరగ నాలించుమా     ||ఈ సాయంకాలమున||
జనక సుత శుద్ధాత్మ – ఘన దేవా స్తుతియింతుం
అనిశము జీవించి – రా – జ్యంబు జేయు మామేన్     ||ఈ సాయంకాలమున||

📖 English Lyrics

Ee Saayankaalamuna – Yesu Prabho Vededamu
Nee Sudayaarasa Molka – Nithyambu Mamu Gaavu     ||Ee Saayankaalamuna||
Chedda Kalal Raakunda – Naddaginchumi Prabho
Biddalamu Raathrilo – Bheethi Baapumu Thandri     ||Ee Saayankaalamuna||
Dushtundou Shodhakuni – Drokkutaku Balamimmu
Bhrashtathvamuna Memu – Padakunda Gaapaadu     ||Ee Saayankaalamuna||
Nee Yeka Puthrundou – Shree Yesu Naamamuna
Saayam Praardhanalella – Saraga Naalinchumaa     ||Ee Saayankaalamuna||
Janaka Sutha Shuddhaathma – Ghana Devaa Sthuthiyinthum
Anishamu Jeevinchi Raa-jyambu Jeyu Maamen     ||Ee Saayankaalamuna||

🙏 Share This Song

WhatsApp Facebook Telegram Twitter