కరుణామయుడా పరలోక రాజా

🔊 karuNAmayuDA paraloka rAjA

📖 తెలుగు సాహిత్యం

కరుణామయుడా పరలోక రాజా
నిత్యనివాసి నిర్మల హృదయుడా (2)
నీకే స్తోత్రములు – నీకే స్తోత్రములు
నీకే స్తోత్రములు – దేవా నీకే స్తోత్రములు
నీకే స్తోత్రములు           ||కరుణామయుడా||
గడిచిన దినములన్ని కాపాడినావు
కృపాక్షేమములే నా వెంట ఉంచావు (2)
విడువక నా యెడల కృప చూపినావు (2)
విడువను యేసయ్యా మరువను నీ ప్రేమ (2)          ||నీకే స్తోత్రములు||
శోధనలెన్నో నా చుట్టూ క్రమ్మినా
వేదనలెన్నో కలిగిన వేళలో (2)
సహించే శక్తి నాకిచ్చినావు (2)
నీ సేవలో నన్ను నడిపించినావు (2)          ||నీకే స్తోత్రములు||
నూతన యుగములోన నను నిలిపినావు
నూతనాత్మతో నను నింపు దేవా (2)
నిత్యము సేవలో పౌలు వలె పరుగెత్తి (2)
ప్రాణము పోయే వరకు ప్రకటింతు నీ వార్త (2)          ||నీకే స్తోత్రములు||

📖 English Lyrics

Karunaamayudaa Paraloka Raajaa
Nithyanivaasi Nirmala Hrudayudaa (2)
Neeke Sthothramulu – Neeke Sthothramulu
Neeke Sthothramulu – Devaa Neeke Sthothramulu
Neeke Sthothramulu             ||Karunaamayudaa||
Gadichina Dinamulanni Kaapaadinaavu
Krupaakshemamule Naa Venta Unchaavu (2)
Viduvaka Naa Yedala Krupa Choopinaavu (2)
Viduvanu Yesayyaa Maruvanu Nee Prema (2)          ||Neeke Sthothramulu||
Shodhanalenno Naa Chuttu Kramminaa
Vedhanalenno Kaligina Velalo (2)
Sahinche Shakthi Naakichchinaavu (2)
Nee Sevalo Nannu Nadipinchinaavu (2)          ||Neeke Sthothramulu||
Noothana Yugamulona Nanu Nilipinaavu
Noothanaathmatho Nanu Nimpu Devaa (2)
Nithyamu Sevalo Poulu Vale Parugetthi (2)
Praanamu Poye Varaku Prakatinthu Nee Vaartha (2)          ||Neeke Sthothramulu||

🙏 Share This Song

WhatsApp Facebook Telegram Twitter