కొండల తట్టు

🔊 kòMDala taTTu

📖 తెలుగు సాహిత్యం

కొండల తట్టు కన్నులెత్తుచున్నాను
నాకు సాయమెచ్చట నుండి వచ్చును
భూమి యాకాశముల సృజించిన
యెహోవా వలన సాయము కల్గున్    ||కొండల||
నీ పాదము తొట్రిల్ల నీయడు
నిన్ను కాపాడువాడు కునుకడు    ||కొండల||
ఇశ్రాయేలును కాచు దేవుడు
కునుకడు నిద్రపోడు యెన్నడు    ||కొండల||
యెహోవాయే నిన్ను కాపాడును
కుడి ప్రక్క నీడగా నుండును    ||కొండల||
పగటెండ రాత్రి వెన్నెల దెబ్బ
నీకు తగులకుండ కాపాడును    ||కొండల||
ఎట్టి అపాయమైన రాకుండ
ఆయన నీ ప్రాణము కాపాడున్    ||కొండల||
ఇది మొదలుకొని నిత్యము నీ
రాకపోకలందు నిను కాపాడున్    ||కొండల||

📖 English Lyrics

Kondala Thattu Kanuletthuchunnaanu
Naaku Saayamechchata Nundi Vachchunu
Bhoomi Yaakaashamula Srujinchina
Yehovaa Valana Saayamu Kalgun       ||Kondala||
Nee Paadamu Thotrillaneeyadu
Ninnu Kaapaaduvaadu Kunukadu       ||Kondala||
Ishraayelunu Kaachu Devudu
Kunukadu Nidrapodu Ennadu       ||Kondala||
Yehovaaye Ninnu Kaapaadunu
Kudi Prakka Needagaa Nundunu       ||Kondala||
Pagatenda Raathri Vennela Debba
Neeku Thagulakunda Kaapaadunu       ||Kondala||
Etti Apaayamaina Raakunda
Aayana Nee Praanamu Kaapaadun       ||Kondala||
Idi Modalukoni Nithyamu Nee
Raakapokalandu Ninu Kaapaadun       ||Kondala||

🙏 Share This Song

WhatsApp Facebook Telegram Twitter