సౌందర్యపూర్ణుడా – Saumdaryapoornudaa

🔊 Saumdaryapoornudaa

📝 Credits HOSANNA MINISTRIES

📖 తెలుగు సాహిత్యం

సౌందర్యపూర్ణుడా సర్వలోకానాథుడా
రమ్యమైన పాలకా గొప్ప రక్షణా కారకా
యేసయ్యా నా ప్రాణప్రియుడా
మనస్సంతా నిండిన మధురాను బంధమా అతిప్రియుడా నా ప్రాణేశ్వరా
అపురూపమే నీ ముఖదర్శనం

మనసారా నిన్నే చేరి
ప్రియమారా నిన్నే కొలిచి
ప్రణుతింతును ఆశతీరా అతికాంక్షణీయుడా || సౌందర్యపూర్ణుడా ||

1.సద్భక్తితో బ్రతుక ఆశించగా
వాగ్ధాన ధ్వనులే బలపరచెను
విశ్వాసయాత్ర కడగండ్ల పాలైననూ
కన్నీటి కడలి చెలరేగి పొంగిననూ
నీవే నిమ్మళపరచినావు

2.మరిశ్రేష్ఠమైన యీవులను దయచేయ
నీ కరుణచూపి నా కొసగినావు
సమృద్ధి జీవము నా కొరకే తెచ్చితివి
సమీపించలేని నీ మహిమకై పిలిచిన
మహిమోన్నతుడా యేసయ్యా

3.త్వరలో రానైయున్న నా ప్రియుడవు
కను రెప్పపాటున నిను చేరెదను
కనులార నిను చూసి మైమరిచిపోయే
కనువిందు చేసే మహిమానగరిలో
పరవశమే ప్రతినిత్యము

📖 English Lyrics

Saumdaryapoornudaa sarvalokaanaathudaa
ramyamaina paalakaa goppa rakshanaa kaarakaa
yesayyaa naa praanapriyudaa
manassamtaa nimdina madhuraanu bamdhamaa atipriyudaa naa praaneshvaraa
apuroopame nee mukhadarshanam

manasaaraa ninne cheri
priyamaaraa ninne kolichi
pranutimtunu aashateeraa atikaamkshaneeyudaa || saumdaryapoornudaa ||

1.sadbhaktito bratuka aashimchagaa
vaagdhaana dhvanule balaparachenu
vishvaasayaatra kadagamdla paalainanoo
kanneeti kadali chelaregi pomginanoo
neeve nimmalaaparachinaavu

2.marishreshthamaina yeevulanu dayacheya
nee karunachoopi naa kosaginaavu
samruddhi jeevamu naa korake techchitivi
sameepimchaleni nee mahimakai pilichina
mahimonnatudaa yesayyaa

3.tvaralo raanaiyunna naa priyudavu
kanu reppapaatuna ninu cheredanu
kanulaara ninu choosi maimarichipoye
kanuvimdu chese mahimaanagarilo
paravashame pratinityamu

🎥 Watch on YouTube

🙏 Share This Song

WhatsApp Facebook Telegram Twitter