అంధకార చెరసాలలో

🔊 aMdhakAra chèrasAlalo

📖 తెలుగు సాహిత్యం

అంధకార చెరసాలలో – బంధకాల ఇరుకులో
పౌలు సీలలు ప్రార్ధించిరి – కీర్తనలు పాడిరి – (2)
భూమియే కంపించెను – చెరసాల అదిరెను
వారి సంకెళ్లు ఊడిపోయెను – విడుదల దొరికెను – (2)
వ్యాధులు ఆవరించగా – మరణము తరుముచుండగా
రండి పారి పోదుము – ఇంక దాగి యుందుము
ఏ తెగులు దరిచేరని – ఏ దిగులు ఉండని
మన దాగు స్థలములో – యేసుని సన్నిధిలో          ||అంధకార||
ప్రార్ధన చేసెదము – దేవుని సముఖములో
ఈ శోధన సమయములో – విరిగిన హృదయముతో
ఈ లోక రక్షణకై – జనముల స్వస్థతకై
యేసుని వేడెదము – శోకము తొలగించమని          ||అంధకార||
మొరలను ఆలకించును – యేసు మనలను విడిపించును
ఈ లోకమును శుద్ధిచేయును – మరణమును తప్పించును
మన రక్షణ వలయముగా – తన రెక్కలు చాపును
దుఃఖమును సంతోషముగా – మార్చివేయును త్వరలో          ||అంధకార||

📖 English Lyrics

Andhakaara Cherasaalalo – Bandhakaala Irukulo
Poulu Seelalu Praardhinchiri – Keerthanalu Paadiri – (2)
Bhoomiye Kampinchenu – Cherasaala Adirenu
Vaari Sankellu Oodipoyenu – Vidudala Dorikenu – (2)
Vyaadhulu Aavarinchagaa – Maranamu Tharumuchundagaa
Randi Paari Podumu – Inka Daagi Yundumu
Ae Thegulu Dari Cherani – Ae Digulu Undani
Mana Daagu Sthalamulo Yesuni Sannidhilo        ||Andhakaara||
Praardhana Chesedamu – Devuni Samukhamulo
Ee Shodhana Samayamulo – Virigina Hrudayamutho
Ee Loka Rakshanakai – Janamula Swasthathakai
Yesuni Vededamu – Shokamu Tholaginchamani        ||Andhakaara||
Moralanu Aalakinchunu – Yesu Manalanu Vidipinchunu
Ee Lokamunu Shudhdhi Cheyunu – Maranamunu Thappinchunu
Mana Rakshana Valayamugaa – Thana Rekkalu Chaapunu
Dukhamunu Santhoshamugaa – Maarchiveyunu Thvaralo ||Andhakaara||

🙏 Share This Song

WhatsApp Facebook Telegram Twitter