కన్నులు కలవర పడుతున్నాయి

🔊 KANNULU KALAVARAPEDUTHUNNAYI

📝 Credits Lyrics & tune : Bro. Ramesh ponguleti Producer : Sis P. Salomi Music : Prasanth Penumaka

📖 తెలుగు సాహిత్యం

కన్నులు కలవర పడుతున్నాయి నీ కొరకే యేసయ్య
కాళ్లు పరుగులు పెడుతున్నాయి నిను చేరుటకె యేసయ్య
చేతులు రెండు నీకై శబ్దం చేస్తున్నాయి
నా ప్రాణం నీకై ఆశగా చూస్తుంది

ఈ లోకం ఇవ్వలేని మనశాంతిని
ఇవ్వగలవాడవు నీవే దీర్ఘశాంతుడా

అను పల్లవి :
నా కొరకు రక్తం కార్చిన రక్షకుడా
నా కొరకు ప్రాణం పెట్టిన కృపామయుడా ||2||

చరణం 1:
నీ వాక్యముతో మంచి చెడులను చెప్పిన యేసయ్యా
కులము మతము బేదం లేదన్నావయ్య ||2||

నీ సంకల్పములో నేను నిలవాలని
నీ ఏర్పాటంతటిలో నేనుండాలని
ఊహాతీతమైన ప్రేమ చూపి
ఊహించని కార్యములు చేసితివి
ఏమివ్వగలనయ్య నీ ప్రేమకు
నా హృదయము నీ కంకితం

చరణం 2:
ఎంతమంది ఉన్నా - ఎవరు చేయని త్యాగము చేసిన యేసయ్య
నిన్ను వెదకిన వారికి - వెలుగువైనావయ్యా ||2||
నీ సంకల్పం ధరణీయంతటా
నిలిచియున్నది
సకలజనులు - నిన్నే ఆశ్రయింతురు
నీ కరుణ నా యడల నిత్యం నిలిచేది
నీ వాత్సల్యత - నాలో ప్రవహించుచున్నది

ఘనమైన పాత్రగా - మలచుమయా
నీ దీవెనలే నాకు చాలయ్యా

📖 English Lyrics

Kannulu kalavara padutunnaayi nee korake yesayya
kaalalu parugulu pedutunnaayi ninu cherutake yesayya
chetulu remdu neekai shabdam chestunnaayi
naa praanam neekai aashagaa choostumdi

ee lokam ivvaleni manashaamtini
ivvagalavaadavu neeve deerghashaamtudaa

anu pallavi :
naa koraku raktam kaarchina rakshakudaa
naa koraku praanam pettina krupaamayudaa ||2||

charanam 1:
nee vaakyamuto mamchi chedulanu cheppina yesayyaa
kulamu matamu bedam ledannaavayya ||2||

nee samkalpamulo nenu nilavaalani
nee erpaatamtatilo nenumdaalani
uuhaateetamaina prema choopi
uuhimchani kaaryamulu chesitivi
emivvagalanayya nee premaku
naa hrudayamu nee kamkitam

charanam 2:
emtamamdi unnaa - evaru cheyani tyaagamu chesina yesayya
ninnu vedakina vaariki - veluguvainaavayyaa ||2||
nee samkalpam dharaneeyamtataa
nilichiyunnadi
sakalajanulu - ninne aashrayimturu
nee karuna naa yadala nityam nilichedi
nee vaatsalyata - naalo pravahimchuchunnadi

ghanamaina paatragaa - malachumayaa
nee deevenale naaku chaalayyaa

🎥 Watch on YouTube

🙏 Share This Song

WhatsApp Facebook Telegram Twitter