నన్ను విడువలేదయ్య నేను పారిపోయిన

📝 Credits Lyrics, Composition & Production: Manoj (MJ) Mathai – USA

📖 తెలుగు సాహిత్యం

నన్ను విడువలేదయ్య నేను పారిపోయిన
వేదకి నన్ను పట్టుకున్నావు
నీకు దూరమైనను నిను కాదనిపోయిన
వెంటాడి హత్తుకున్నావు 2
నీ ప్రేమ నిత్యము వెంబడిస్తూనే ఉందయ్యా
నీ కృప నను విడువక కనికరిస్తూనే ఉందయ్య 2
వందనాలయ్య యేసు వందనాలయ్య 4

మొండి జీవితమే నాది మార్పుకోరనది
అహంకారమే నాలో అలలై పొంగుచుండెను 2
అన్నీ ఉన్నాయన్న గర్వం
నీ మధుర స్వరం వినలేకపోయింది 2
అకస్మాత్తుగా నా జీవితం
అంధకారంలో పడిపోయింది
నా హృదయం ముక్కలయ్యి
చేల్లాచెదురై పోయింది 2 ( నీ ప్రేమ నిత్యము )

గాఢాంధకారమే నన్ను నలువైపు చుట్టుకున్నది
బ్రతుకుతానన్న ఆశే లేకుండా కృంగచేసేను 2
కన్నీళ్లతో మోకాళ్ళపై కూర్చొని
మొరపెట్టి ప్రార్థించుచున్నాను 2
ఆ చీకటి రోజుల్లో ప్రత్యక్షమయ్యావు
దివ్యవెలుగులతో నను నింపావు
నా స్థితిగతులే మార్చేశావు
నూతన జీవం నాకిచ్చావు 2 ( నీ ప్రేమ నిత్యము )

📖 English Lyrics

Nannu Viduvaledayya Nenu Paripoyina
Vedaki Nannu Pattukunnavu
Niku Duramainanu Ninu Kadanipoyina
Vèmtadi Hattukunnavu 2
Ni Prema Nityamu Vèmbadistune Umdayya
Ni Krripa Nanu Viduvaka Kanikaristune Umdayya 2
Vamdanalayya Yesu Vamdanalayya 4

Mòmdi Jivitame Nadi Marpukoranadi
Ahamkarame Nalo Alalai Pòmguchumdènu 2
Anni Unnayanna Garvam
Ni Madhura Svaram Vinalekapoyimdi 2
Akasmattuga Na Jivitam
Amdhakaramlo Padipoyimdi
Na Hrridayam Mukkalayyi
Chellachèdurai Poyimdi 2 ( Ni Prema Nityamu )

Gadhamdhakarame Nannu Naluvaipu Chuttukunnadi
Bratukutananna Ashe Lekumda Krrimgachesenu 2
Kannillato Mokallapai Kurchòni
Mòrapètti Prarthimchuchunnanu 2
A Chikati Rojullo Pratyakshamayyavu
Divyavèlugulato Nanu Nimpavu
Na Sthitigatule Marcheshavu
Nutana Jivam Nakichchavu 2 ( Ni Prema Nityamu )

🎥 Watch on YouTube

🙏 Share This Song

WhatsApp Facebook Telegram Twitter