యెషయా 26:3
నిన్ను ఆశ్రయించినవానికి నీవు సంపూర్ణ సమాధానము కలుగజేయుదువు; అతడు నిన్నే నమ్ముకొనుచున్నాడు.
Read more
యెషయా 40:31
యెహోవాకై కనిపెట్టువారు నూతన బలము పొందుదురు; పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకెగురుదురు; పరుగెత్తినను అలసిపోరు, నడిచినను సొమ్మసిల్లరు.
Read more
యిర్మీయా 29:11
మీ విషయమై నేను ఉద్దేశించిన సంగతులు నాకు తెలుసు; అవి సమాధానమునుగూర్చిన ఉద్దేశములే గాని అపాయమునుగూర్చినవి కావు; మీకు నిరీక్షణకరమైన భవిష్యత్తును కలుగజేయుటయే నా ఉద్దేశము.
Read more
విలాపవాక్యములు 3:22-23
యెహోవా కృపవలన మనము నిర్మూలము కాకున్నాము; ఆయన కనికరములు ఎన్నటికిని ఆగిపోవు. అవి ప్రతి ఉదయమున నూతనములు.
Read more
మీకా 6:8
మేలు చేయుట, కనికరమును ప్రేమించుట, నీ దేవుని యెదుట దీనమనస్సుతో నడుచుట తప్ప మరేమి యెహోవా నిన్నడుగుచున్నాడు?
Read more
నహూము 1:7
యెహోవా దయాళుడు; ఆపత్కాలమందు ఆయన ఆశ్రయదుర్గము; తనను ఆశ్రయించువారిని ఆయన ఎరుగును.
Read more