కీర్తనలు 51:10

దేవా, నాలో శుద్ధహృదయము కలుగజేయుము; నా అంతరంగములో స్థిరమైన ఆత్మను నూతనముగా సృష్టించుము.
Read more

కీర్తనలు 62:8

ప్రజలారా, ఎల్లప్పుడును ఆయనను నమ్ముకొనుడి; ఆయన సన్నిధిలో మీ హృదయమును కుమ్మరించుడి; దేవుడు మనకు ఆశ్రయము.
Read more

కీర్తనలు 63:1

దేవా, నీవే నా దేవుడవు; వేకువనే నిన్ను వెదకుదును. నీకొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది.
Read more

కీర్తనలు 73:26

నా శరీరమును నా హృదయమును క్షీణించినను దేవుడే నిత్యము నా హృదయబలము, నా భాగమై యున్నాడు.
Read more

యోహాను 11:25

యేసు ఆమెతో నేను పునరుత్థానమును జీవమునై ఉన్నాను; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును.
Read more

యోహాను 14:6

యేసు అతనితో నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను; నా ద్వారానే తప్ప ఎవడును తండ్రియొద్దకు రాడు.
Read more