Bible Verses
ప్రతిరోజూ దేవుని వాక్యంతో మీ హృదయాన్ని నింపుకోండి
నేటి బైబిల్ వాక్యం
12 సెప్టెంబర్ 2026
కీర్తనలు 119:105
నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై యున్నది.
Read Full Verse →ఫిలిప్పీయులకు 4:13
నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను.
Read Full Verse →కీర్తనలు 23:1
యెహోవా నా కాపరి; నాకు కొదువలేదు.
Read Full Verse →సామెతలు 3:5
నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము; నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనకుము.
Read Full Verse →రోమీయులకు 8:28
దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడినవారికి, సమస్తమును మేలుకలుగుటకై సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము.
Read Full Verse →కీర్తనలు 37:5
నీ మార్గమును యెహోవాకు అప్పగించుము; ఆయనను నమ్ముకొనుము; ఆయన కార్యము నెరవేర్చును.
Read Full Verse →మత్తయి 6:33
ముందుగా ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకుడి; అప్పుడు ఇవన్నియు మీకు అనుగ్రహింపబడును.
Read Full Verse →కీర్తనలు 121:1-2
నేను కొండలతట్టు కన్నులెత్తి చూచుచున్నాను; నాకు సహాయము ఎక్కడనుండి వచ్చును? ఆకాశమును భూమిని సృజించిన యెహోవా యొద్దనుండే నాకు సహాయము వచ్చును.
Read Full Verse →రోమీయులకు 8:31
దేవుడు మన పక్షమున ఉన్నయెడల మనకు విరోధి ఎవడు?
Read Full Verse →కీర్తనలు 46:10
ఊరకుండి నేనే దేవుడనని తెలిసికొనుడి.
Read Full Verse →సామెతలు 3:6
నీ మార్గములన్నిటిలో ఆయనను గుర్తించుము; అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.
Read Full Verse →కీర్తనలు 56:3
నేను భయపడు దినమున నిన్నే నమ్ముకొందును.
Read Full Verse →కీర్తనలు 16:8
నేను యెహోవాను ఎల్లప్పుడు నా యెదుట ఉంచుకొంటిని; ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదలనివాడను.
Read Full Verse →కీర్తనలు 20:7
కొందరు రథములనుబట్టి, కొందరు గుఱ్ఱములనుబట్టి అతిశయించుదురు; మనమైతే మన దేవుడైన యెహోవా నామమునుబట్టి అతిశయించుదము.
Read Full Verse →కీర్తనలు 73:26
నా శరీరమును నా హృదయమును క్షీణించినను దేవుడే నిత్యము నా హృదయబలము, నా భాగమై యున్నాడు.
Read Full Verse →కీర్తనలు 119:165
నీ ధర్మశాస్త్రమును ప్రేమించువారికి గొప్ప సమాధానము కలదు; వారికి ఆటంకము ఏదియు కలుగదు.
Read Full Verse →సామెతలు 16:9
మనుష్యుని హృదయము తన మార్గమును యోచించును; యెహోవా అతని అడుగులను స్థిరపరచును.
Read Full Verse →యెషయా 26:3
నీ మీద ఆధారపడిన మనస్సును నీవు సంపూర్ణ సమాధానములో కాపాడుదువు; అది నిన్ను నమ్ముకొనుచున్నది.
Read Full Verse →యిర్మీయా 33:3
నన్ను మొఱ్ఱపెట్టుము; నేను నీకు ఉత్తరమిచ్చెదను; నీవు ఎరుగని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేసెదను.
Read Full Verse →యిర్మీయా 17:7
యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు; యెహోవాయే అతనికి ఆధారము.
Read Full Verse →