Bible Verses
ప్రతిరోజూ దేవుని వాక్యంతో మీ హృదయాన్ని నింపుకోండి
నేటి బైబిల్ వాక్యం
12 సెప్టెంబర్ 2026
కొలస్సయులకు 3:13
ఒకనియెడల ఒకడు సహించుచు, ఎవడైనను మరియొకనిమీద నేరము మోపినయెడల ఒకనినొకడు క్షమించుడి; ప్రభువు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును క్షమించుడి.
Read Full Verse →కొలస్సయులకు 3:14
వీటన్నిటిమీద సంపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి.
Read Full Verse →1 యోహాను 4:7
ప్రియులారా, ఒకరినొకరు ప్రేమించుకొందము; ప్రేమ దేవునిలోనుండి కలుగుచున్నది; ప్రేమించు ప్రతివాడును దేవునిమూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును.
Read Full Verse →1 యోహాను 4:19
ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము.
Read Full Verse →కీర్తనలు 103:8
యెహోవా కనికరముగలవాడును దయగలవాడును, కోపించుటకు దీర్ఘశాంతుడును కృపచేత సమృద్ధుడునై యున్నాడు.
Read Full Verse →సామెతలు 10:12
ద్వేషము కలహములను రేపును; ప్రేమ సమస్త అపరాధములను కప్పును.
Read Full Verse →సామెతలు 17:17
స్నేహితుడు ఎల్లకాలము ప్రేమించును; సహోదరుడు ఆపత్కాలమందు పుట్టును.
Read Full Verse →మత్తయి 6:14
మనుష్యుల అపరాధములను మీరు క్షమించినయెడల పరలోకమందున్న మీ తండ్రియు మీ అపరాధములను క్షమించును.
Read Full Verse →మత్తయి 7:12
కాబట్టి మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి.
Read Full Verse →లూకా 10:27
నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ పూర్ణమనస్సుతోను ప్రేమింపవలెను; నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను.
Read Full Verse →యోహాను 15:12
నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకరు ప్రేమించవలెననేదే నా ఆజ్ఞ.
Read Full Verse →రోమీయులకు 12:10
సహోదర ప్రేమ విషయములో ఒకరియెడల ఒకరు అనురాగముగలవారై, ఘనత విషయములో ఒకరినొకరు గొప్పగా ఎంచుకొనుడి.
Read Full Verse →గలతీయులకు 5:13
ప్రేమద్వారా ఒకరికొకరు సేవచేసుకొనుడి.
Read Full Verse →గలతీయులకు 6:2
ఒకరి భారములను ఒకరు భరించి క్రీస్తు ధర్మశాస్త్రమును నెరవేర్చుడి.
Read Full Verse →ఎఫెసీయులకు 4:2
సంపూర్ణమైన దీనత్వముతోను సాత్వికముతోను దీర్ఘశాంతముతోను ప్రేమతో ఒకరినొకరు సహించుచు ఉండుడి.
Read Full Verse →ఎఫెసీయులకు 5:2
క్రీస్తు మనలను ప్రేమించి మనకొరకు తనను తాను దేవునికి సువాసనగల అర్పణగాను బలిగాను అప్పగించెను; కావున మీరు ప్రేమగలవారై ఆయనను పోలి నడచుకొనుడి.
Read Full Verse →ఫిలిప్పీయులకు 2:5
క్రీస్తుయేసునకు కలిగిన మనస్సే మీలో ఉండునుగాక.
Read Full Verse →1 థెస్సలొనీకయులకు 5:11
ఒకరినొకరు ఆదరించుకొనుడి, ఒకరినొకరు క్షేమాభివృద్ధి చేయుడి.
Read Full Verse →1 యోహాను 3:18
మనము మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమించుదము.
Read Full Verse →1 యోహాను 4:7
ప్రియులారా, మనము ఒకరినొకరు ప్రేమించుదము; ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది.
Read Full Verse →- ← Previous
- 1
- 2
- 3
- Next →